ట్రోలింగ్ అప్పుడే మొదలైంది

Anasuya

అనసూయ అంటే ట్రోలింగ్.. ట్రోలింగ్ అంటే అనసూయ. సోషల్ మీడియాలో ఈమెపై నిత్యం ఏదో ఒక ట్రోలింగ్ నడుస్తూనే ఉంది. అనసూయ కూడా తక్కువేం కాదు. వాటిపై ఎప్పటికప్పుడు రియాక్ట్ అవుతూ గట్టి సమాధానం ఇస్తూనే ఉంటుంది.

ఇంతకీ అనసూయకు తన కెరీర్ లో మొట్టమొదటి ట్రోలింగ్ ఎప్పుడు ఎదురైంది? ఈ ప్రశ్నకు ఆమె స్వయంగా సమాధానం చెప్పుకొచ్చింది.

Photos: Anasuya Bharadwaj

“నేను బాగుంటానని అంతా అంటుండేవారు. అలా ఇంట్రెస్ట్ పుట్టి టీవీ ఫీల్డ్ లోకి ఎంటరయ్యాను. ఓ యాడ్ చూసి అప్లయ్ చేస్తే 2 రోజుల్లో కాల్ వచ్చింది. 11వ రోజు లైవ్ లోకి వచ్చేశా. నా మొదటి ఎపిసోడ్ నుంచే నాకు ట్రోలింగ్ మొదలైంది. నా ఇంగ్లిష్-తెలుగు మిక్సింగ్ చూసి చాలామంది కామెంట్ చేశారు. అలా అందరి కళ్లల్లో పడ్డాను.”

అలా ప్రారంభమైన ట్రోలింగ్.. “అత్తారింటికి దారేది” సినిమా టైమ్ కు పీక్స్ కు చేరుకుందని తెలిపింది అనసూయ. ఆ టైమ్ లో ఆన్ లైన్ లో వేధింపుల్ని తట్టుకోలేకపోయానని, చాలాసార్లు ఏడ్చానని చెప్పుకొచ్చింది.

“అత్తారింటికి దారేది సినిమా టైమ్ లో నేను అప్పుడే ట్విట్టర్ లోకి వచ్చాను. ఆ సినిమాలో పార్టీ సాంగ్ ఆఫర్ ను నేను వదిలేసుకున్నాను. దానిపై స్పందిస్తూ.. నలుగురిలో ఒకదానిలా, గుంపులో గోవిందంలా నేను అందులో లేకపోవడం మంచిదైంది అంటూ స్పందించాను. నాపై తీవ్రస్థాయిలో ట్రోలింగ్ మొదలైంది ఆ క్షణం నుంచే.”

ప్రస్తుతం తను ట్రోల్స్ ను పెద్ద సీరియస్ గా పట్టించుకోనని చెప్పింది అనసూయ. అలాఅని తనపై సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్ ను వదిలేయనని.. ప్రతి కామెంట్ ను చదువుతానని, అవసరమైతే స్క్రీన్ షాట్ తీసి మరీ ఎదురుదాడి చేస్తానని ధైర్యంగా చెబుతోంది.

Related Stories