- Advertisement -

అనసూయ మళ్ళీ ఐటెం పాటల్లోకి వచ్చింది. చాలా గ్యాప్ తర్వాత ఆమె ఒక సినిమాలో స్పెషల్ సాంగ్ చేయనుంది. అనసూయ ఇప్పుడు వైవిధ్యమైన పాత్రలు చేస్తూ బిజీగా ఉంది. ఇలాంటి టైంలో ఆమె ఐటెం సాంగ్ చేసేందుకు అంగీకరించడం విశేషం.
కార్తికేయ హీరోగా, లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా రూపొందుతోన్న ‘చావు కబురు చల్లగా’ సినిమాలో ఆమె ఒక పాటలో మెరవనుంది. త్వరలోనే ఆమెపై ఈ పాట చిత్రీకరిస్తారు. అనసూయకి ఈ పాటలో కనిపిస్తున్నందుకు భారీ మొత్తం ముడుతోందట.
మార్చి నెలలోనే ఈ మూవీని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.