- Advertisement -

అనసూయ కూడా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనుందా? ఈ ప్రశ్నకు అవును అనే ఆన్సర్ చెప్పాలి. కాకపొతే, ఆమె ఇంకా ఆఫీసియల్ గా “ఎస్” చెప్పలేదు వచ్చిన ఆఫర్ కి. సౌత్ నుంచి హిందీలోకి రీమేక్ అవుతోన్న ఒక సినిమాలో ఒక కీలక పాత్రకి ఆమెని అడిగారట హిందీ మేకర్స్. కానీ అనసూయ ఇంకా సైన్ చెయ్యలేదు.
ఆ పాత్ర చెయ్యడం వల్ల తన కెరీర్ కి హెల్ప్ అవుతుందా లేదా అని ఆమె ఆలోచిస్తోంది.
ఈ ఏడాది ఇప్పటికే రష్మిక, సమంత వంటి భామలు బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నారు. ఇప్పుడు అనసూయ కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తే… ఆమె వీరి లిస్ట్ లో చేరుతుంది.
అనసూయ ఇప్పటికే తమిళంలో ఒక సినిమా చేస్తోంది. మలయాళంలో కూడా అఫర్ వచ్చిందిట. అంటే అనసూయకిప్పుడు ఇతర భాషల్లో కూడా డిమాండ్ పెరుగుతోంది.