- Advertisement -

అందాల అనసూయ భరద్వాజ్ కి ఇప్పటికే ఇద్దరు పిల్లలు. ఐతే, ఇప్పుడు మరోసారి తల్లి కావాలనుకుంటుంది. “ఆ మాతృత్వపు మధురిమ మరోసారి అనుభవించాలని ఉంది,” అని లేటెస్ట్ గా అంటోంది. అనసూయ భర్త అభిప్రాయం ఏంటో తెలీదు కానీ అనసూయ మాత్రం మళ్లీ తల్లి అవుతాను అంటోంది.
ఆమె తన కొత్త సినిమాలో ప్రెగ్నన్ట్ వుమన్ గా కనిపించనుంది. “థాంక్యూ బ్రదర్” అనే సినిమాలో వెండితెరపై ప్రేగ్నన్ట్ లేడీగా దర్శనమివ్వనుంది. రియల్ లైఫ్ లో ఆమె మళ్ళీ తల్లి కావడం అనేది పర్సనల్ మ్యాటర్ కానీ వెండితెరపై మాత్రం ఆమె కోరిక నెరవేరుతుంది.
36 ఏళ్ల అనసూయ ఇప్పుడు వరుసగా సినిమాలు సైన్ చేస్తోంది. రవితేజ హీరోగా రూపొందుతోన్న “కిలాడి” సినిమాలో కూడా కీలక పాత్ర పోషిస్తోంది.