
అనసూయ కెరీర్ లో ఒక మైలురాయి …రంగస్థలం. ‘రంగమ్మత్త’ పాత్రలో అనసూయ అద్భుతంగా నటించిన విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమెని మరోసారి సుకుమార్ తన సినిమాలో తీసుకోవడంతో అనసూయకి మరో కీలక పాత్ర దక్కింది అని అందరూ అనుకున్నారు. కానీ, ‘పుష్ప’లో ఆమె సునీల్ భార్యగా చిన్న పాత్రలో దర్శనమివ్వడం విస్మయానికి గురిచేసింది.
ఆమె ఉన్నా లేకున్నా ఫరక్ పడదు అన్నట్లుగా సాగే పాత్ర అది. ఐతే, సుకుమార్ దీనిపై వివరణ ఇచ్చారు.
“పుష్ప మొదటి భాగం అంతా పాత్రల పరిచయం వారి తీరుతెన్నులు వివరించేందుకు సరిపోయింది. అసలైన కథ, మసాలా రెండో భాగంలో ఉంటుంది. మొదటి భాగంలో తక్కువ కనిపించిన పాత్రలకు రెండో భాగంలో ప్రాధాన్యం ఉంటుంది,” అని సుకుమార్ చెప్పారు.
అంటే, అనసూయ అభిమానులు ఆమెకి పాత్ర పరంగా అన్యాయం జరిగింది అని బాధ పడాల్సిన అవసరం లేదు. రెండో భాగంలో దాక్ష్యాయని “ఇచ్చి పడేస్తుంది” అన్నమాట.