గిల్లితే గిల్లించుకోవాలా?

- Advertisement -


అనసూయ బోల్డ్ అండ్ బ్యూటిఫుల్. ఆమె ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతోంది. తాజాగా ఒక సీనియర్ జర్నలిస్ట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు విషయాలు ధైర్యంగా చెప్పింది. సినిమా ఇండస్ట్రీలో మేల్ డామినేషన్ ఎలా ఉంటుందో వివరించింది.

హీరోయిన్లకు తప్ప మిగతా ఆడవాళ్లకు సినిమా ఇండస్ట్రీలో గౌరవం, ప్రాధాన్యత తక్కువే.

“గిల్లితే గిల్లించుకోవాలి అనే డైలాగ్‌ ఉంది కదా.. అలాంటి పరిస్థితి ఉంటుంది,” అని కుండబద్దలు కొట్టింది. ఐతే, ఇప్పుడు పరిస్థితి కొంచెం మారింది అని కూడా వివరించింది.

అనసూయ మొదటి నుంచి కొంచెం ఫెమినిస్ట్ లా మాట్లాడుతుంది. ఐతే, ఆమెకి స్క్రీన్ పై ఉన్న ఇమేజ్ వేరు. దాంతో, ఆమె ఎక్కువగా ట్రోలింగ్ కి గురి అవుతున్న మాట వాస్తవమే. తాజాగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ చూస్తుంటే… ఆమె కొన్ని విషయాల్లో చాలా స్ట్రాంగ్ గా ఉంటారని అనిపిస్తోంది. “పుష్ప 2″లో తన పాత్ర మరింత బలంగా, ప్రాధాన్యతతో ఉంటుంది అని వివరించింది అనసూయ.

 

More

Related Stories