- Advertisement -

ఐటెం సాంగ్ అనడం ఒక బూతు లాంటిదే అంటోంది అనసూయ. అసలు ఐటెం సాంగ్ అనే కాన్సెప్ట్ లేదట. దాన్ని స్పెషల్ సాంగ్ అంటారు కానీ ఐటెం సాంగ్ కాదు అంటోంది.
“చావు కబురు చల్లగా” మూవీలో “పైన పటారం.. లోన లోటారం” అనే పాటలో అనసూయ చిందులేసింది. ఈ సాంగ్ ఇటీవల విడుదలైంది. దాంతో ఒక అభిమాని ఆమెకి సూటిగా ఒక ప్రశ్న వేశాడు. ఐటెం సొంగులు చెయ్యను అని ఇంతకుముందు చెప్పారు కదా…ఇదేంటి మరి? అనేది అతని ప్రశ్న.
దానికి ఆమె వైవిధంగా స్పందించింది. “హలో అది ఐటెం సాంగ్ కాదు.. అసలు ఐటెం సాంగ్ అనేది ఏది లేదమ్మా,” అంటూ అతనికి వివరణ ఇచ్చింది అనసూయ. అలాగే, తాను ఎప్పుడూ ఇలాంటి పాటలు చెయ్యనని చెప్పలేదంటోంది. ఎవరో రాసిన వార్తలకు తాను బాధ్యురాలిని కాదంటోంది.