ఆ కల కూడ నెరవేరిందట

- Advertisement -


అనసూయకి మొన్నటివరకు ఒక కల ఉండేది. అదిప్పుడు తీరిపోయింది. మెగాస్టార్ చిరంజీవితో నటించాలనేది ఆమె డ్రీం. ఆమె కల నిజమైంది.

సినిమాలో కాదు కానీ ఒక యాడ్ ఫిలింలో ఆమె మెగాస్టార్ సరసన నటించింది. ఒక రియల్ ఎస్టేట్ బ్రాండ్ కోసం మెగాస్టార్ చిరంజీవి యాడ్ చేసారు. అందులో చిరంజీవితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకొంది అనసూయ. ఈ యాడ్ ని కూడా సుకుమార్ డైరెక్ట్ చెయ్యడం విశేషం.

అనసూయ యాక్టింగ్ కెరీర్ ని సుకుమార్ మలుపు తిప్పారు. ‘రంగస్థలం’లో రంగమ్మత్త పాత్ర ఇచ్చి ఆమెని బిజీ యాక్టర్ గా మార్చారు. ఇపుడు యాడ్ ఫిలింతో మెగాస్టార్ తో నటించాలన్న ఆమె కలని నెరవేర్చారు.

ప్రస్తుతం పలు పెద్ద సినిమాలతో బిజీగా ఉంది అనసూయ. ‘పుష్ప 2’లో కూడా ఆమెది కీలక పాత్రే.తెలుగుతో పాటు తమిళ, మలయాళ సినిమాల్లో కూడా నటిస్తోంది.

 

More

Related Stories