- Advertisement -

కెరీర్ పరంగా అనసూయ థ్యాంక్స్ చెప్పాల్సి వస్తే ఎవరికి చెబుతుంది. ఒకవేళ వార్నింగ్ ఇవ్వాల్సి వస్తే ఎవరికి ఇస్తుంది. ఈ రెండు ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం చెప్పింది అనసూయ. కెరీర్ పరంగా అడవి శేష్ కు థ్యాంక్స్ చెబుతానంటోంది.
అన్నీ తానై అడవి శేష్ తీసిన “క్షణం” సినిమా అనసూయకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. నటిగా ఆమె కెరీర్ ను మలుపుతిప్పిన సినిమా అది. అందుకే అడవి శేష్ కు ఎప్పుడూ థ్యాంక్స్ చెబుతూనే ఉంటానంటోంది ఈ జబర్దస్త్ బ్యూటీ.
ఇక కెరీర్ లో వార్నింగ్ ఇవ్వాల్సి వస్తే యూట్యూబ్ లో తనపై అడ్డమైన కామెంట్స్ పెట్టేవాళ్లకు వార్నింగ్ ఇస్తానంటోంది అనసూయ. సోషల్ మీడియాలో తనపై వచ్చే కామెంట్స్ అన్నింటినీ తను ఎప్పటికప్పుడు గమనిస్తుంటానని, తనపై కామెంట్ చేసేవాళ్లు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది.