ఎన్టీఆర్ దక్షిణాసియాకే గర్వకారణం!

- Advertisement -
NTR

ఎన్టీఆర్ దక్షిణాసియాకే గర్వకారణం!
తెలుగు సినిమా గర్వించే క్షణాలివి. “ఆర్ ఆర్ ఆర్” సినిమాలోని “నాటు నాటు” పాట ఆస్కార్ గెలుచుకొంది. పాట స్వరపరిచిన కీరవాణితో రాసిన చంద్రబోస్ అవార్డును స్టేజ్ పై అందుకున్నారు. “ఆర్.ఆర్.ఆర్” సినిమా తీసిన రాజమౌళి, అందులో నటించిన రామ్ చరణ్, ఎన్టీఆర్ కూడా అవార్డు కార్యక్రమానికి హాజరయ్యారు.

ఎన్టీఆర్ పులి బొమ్మ ముంద్రించిన షేర్వాణీ ధరించడం విశేషం. రెడ్ కార్పెట్ పై వచ్చిన ఎన్టీఆర్ అందరి చూపులో పడ్డారు.

ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని కవర్ చేస్తున్న యాంకర్ షేర్వాణీపై ముంద్రించిన పులి గురించి అడగ్గా, ఎన్టీఆర్ ఇచ్చిన సమాధానం అదిరింది.

“పులి ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కీలక పాత్ర పోషించింది. ఇక పులి భారతదేశపు జాతీయ జంతువు. అందుకే ఇది. మా దేశ చిహ్నంతో నడవడం నాకు గర్వంగా ఉంటుంది,” అని ఎన్టీఆర్ చెప్పారు. “మిమ్మల్ని చూసి దక్షిణాసియా మొత్తం గర్వపడుతుంది,” అని యాంకర్ ఎన్టీఆర్ ని ప్రశంసించారు.

ఎన్టీఆర్ డ్రెస్ ని ప్రముఖ డిజైనర్ గౌరవ గుప్తా డిజైన్ చేశారు.

Photos: NTR at 95th Oscars

 

More

Related Stories