బయటికొచ్చినా భారీగానే ముట్టిందట

Anchor Ravi

యాంకర్ రవి అనూహ్యంగా 12 వారంలోనే బిగ్ బాస్ నుంచి బయటికొచ్చాడు. ఆయన టైటిల్ విన్నర్ గా ఉంటాడు అనుకున్నారు అంతా. నిజానికి మొత్తం కంటెస్టెంట్ లలో అతనే స్టార్. అత్యధిక పారితోషికం కూడా ఆయనదే. మరి అలాంటి రవి టాప్ 5 లోకి వెళ్లకముందే ఎలిమినేట్ కావడం ఆశ్చర్యమే.

ఫైనల్ రౌండ్ లోకి వెళ్ళకపోవడం రవికి బాధే. రవి ఎలిమినేషన్ జీర్ణించుకొని అతని అభిమానులు నిరసన ర్యాలీలు కూడా తీయడం విశేషం.

కానీ, డబ్బుల పరంగా మాత్రం అతనికి ఏ ఇబ్బంది లేదు. 12 వారాలు ఉన్నాడు హౌజ్ లో. అందరికన్నా అధిక పారితోషికం అతనిదే కాబట్టి తక్కువలో తక్కువ వేసుకున్నా కోటి వరకు ముడుతుంది. అంటే మూడు నెలల్లో కోటి రూపాయల ఆర్జన.

టైటిల్ విన్నర్ కి 50 లక్షలు వస్తుంది. రవికి అంతకు మించి వస్తోంది. సో … ఆ విధంగా అతనికి లాభమే.

ఈ సారి ఎవరు టైటిల్ విన్ అవుతారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సింగర్ శ్రీరామచంద్ర, యూట్యూబర్ షణ్ముఖ్ హాట్ ఫేవరిట్స్ గా కనిపిస్తున్నారు. వచ్చే రెండు వారాల్లో మరో ఇద్దరు బయటికి వస్తారు. మానస్, ప్రియాంక, కాజల్, షణ్ముఖ్, శ్రీరామచంద్ర, సన్నీ ప్రస్తుతం హౌజ్ లో ఉన్నారు. మరి ఆ ఇద్దరు ఎవరు అవుతారో చూడాలి.

 

More

Related Stories