అలా చెయ్యాలంటే భారీగా ఇవ్వాలి!

అలా చెయ్యాలంటే భారీగా ఇవ్వాలి!

ఆండ్రియా బోల్డ్ పాత్రలకి రెడీ అంటోంది. విజయ్ హీరోగా నటించిన ‘మాస్టర్’ సినిమాలో విలువిద్యలో ఎక్స్పర్ట్ గా (బాణాలు విసిరే భామగా) కనిపించింది. అది హిట్ కావడంతో ఆమెకి వెంటనే మరో బిగ్ మూవీలో ఛాన్స్ వచ్చింది. ఇప్పుడు ‘పిశాసు -2’ సినిమాలో చాలా బోల్డ్ గా కనిపించనుందట. అలా కనిపించాలంటే భారీగా పారితోషికం ఇవ్వాలని పట్టుబట్టింది ఈ భామ. ఆమె డిమాండ్ కి మేకర్స్ తలొగ్గారు.

ఆమె సినిమాకి రెగ్యులర్ గా తీసుకునే మొత్తానికి డబుల్ డబ్బులు ఇస్తున్నారట.

ఆండ్రియా ఇదివరకు కొందరి దర్శకుల సినిమాల్లో తప్పనిసరిగా కనిపించేది. ఐతే, గత రెండు, మూడేళ్ళలో ఆమెకి అవకాశాలు తగ్గాయి. ‘మాస్టర్’ హిట్ అయ్యాకే మళ్ళీ ఆఫర్లు వరిస్తున్నాయట.

 

More

Related Stories