
సినిమా ఇండస్ట్రీలో ఇది పెళ్లిళ్ల సీజన్. కరోనా వల్ల పుట్టిన భయమో, మరేదో… చాలా మంది హీరోలు, హీరోయిన్లు సోలో బ్రతుకు సో బెటర్ కాదు అంటూ తమ లవర్స్ తో సెటిల్ అయ్యారు. దాంతో సహజంగానే, ఏజ్ బార్ అయినా ఇంకా సింగిల్ గా ఉన్న హీరోలు, హీరోయిన్లు “మీ పెళ్లి ఎప్పుడు” అన్న ప్రశ్నని ఫేస్ చేస్తున్నారిప్పుడు. కొందరు నవ్వుతూ సమాధానం దాటవేస్తుంటే, కొందరు “త్వరలోనే” అంటున్నారు.
ఐతే, విచిత్రంగా ఆండ్రియా మాత్రం ఈ ప్రశ్నకు కస్సుబుస్సులాడుతోంది. “నన్ను అలాంటి ప్రశ్న అస్సలు అడగొద్దు,” అని మీడియాకి క్లాస్ పీకింది.
Also Check: Andrea Jeremiah – Photos
“సింగల్ గా ఉంటే చాలు బాయ్ ఫ్రెండ్ ఎవరు అనో, పెళ్లి ఎప్పుడనో ప్రశ్నలతోనే మీడియా ఇంటర్వ్యూలు స్టార్ట్ చేయడం బంద్ చెయ్యాలి. ఇలాంటివి నాకు చికాకు,” అని చెప్తోంది. ఆండ్రీకిప్పుడు 35 ఏళ్ళు.