
కంగన రనౌత్ కి మనాలితో పాటు ముంబైలోనూ ఇల్లు ఉంది. ఈ బాలీవుడ్ నటి ఆ మధ్య మహారాష్ట్ర ప్రభుత్వంతో కయ్యానికి దిగింది. ఆ తర్వాత తన మకాం మనాలికి మార్చింది. తాజాగా తన ముంబై ఇల్లుని రీమాడల్ చేయించుకొంది.
తన ఇంటి ఇంటీరియర్ డెకరేషన్ ఎలా ఉందో ఒక వీడియో ద్వారా తన ఫాలొవర్స్ కి చూపించింది. అద్భుతమైన పెయింటింగ్స్ తో అదిరిపోయింది ఆమె అపార్ట్మెంట్. ఆమె అభిరుచి ఏంటో తెలిసింది.
ఐతే, ఇంటి మెయిన్ డోర్ ముందు పెట్టిన ఒక బోర్డు నెటిజెన్లను ఆకట్టుకొంది. “No trespassing. Violators will be shot. Survivors will be shot again!” అనేది ఆ బోర్డు మీద ఉన్న మేటర్. “అనుమతి లేకుండా అడుగుపెడితే కాల్చేస్తాం. ఒకవేళ బతికి బట్టకడితే మళ్ళీ కాలుస్తాం” అనేది ఆ బోర్డు అర్థం.
తనకి మహారాష్ట్రలోని కొన్ని శక్తుల నుంచి ప్రమాదం ఉందని కంగన చాలా కాలంగా చెప్తోంది. కేంద్ర ప్రభుత్వం వై-ప్లస్ కేటగిరి భద్రత కల్పిస్తోంది.