అనిల్ రావిపూడి: F3లో మోర్ ఫన్

Anil Ravipudi

“పటాస్”‌ నుంచి “సరిలేరు నీకెవ్వరు” వరకు వరుసగా ఐదు విజయాలు అందించి తన గ్రాఫ్ ని పెంచుకున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. అనిల్‌ రావిపూడి బర్త్‌ డే నవంబర్‌ 23. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి ముచ్చట్లు….

వరుసగా ఐదు బ్లాక్‌బస్టర్స్‌ ఇవ్వడం ఎలా అనిపిస్తోంది?
ఇది అదృష్టం. ఈ ఐదు సినిమాల వల్ల కెరీర్‌లో దర్శకుడిగా మంచి గుర్తింపు సాధించడమే కాదు. ఫైనాన్సియల్‌గా ఎదిగాను. అలాగే నా స్నేహితుడు ఎస్‌. కష్ణని ప్రొడ్యూసర్ గా పరిచయం చేస్తున్నాను.. షైన్‌ స్క్రీన్స్‌ సాహుగారపాటి, హరీశ్‌ పెద్దిగారితో కలిసి చేస్తున్న “గాలి సంపత్‌” సినిమా బాధ్యత అంతా తానే చూసుకుంటాడు. ఈ బ్యానర్లో తీసే సినిమాలకు నా క్రియేటివ్ సపోర్ట్ ఉంటుంది.

ఎఫ్‌ 3 ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు?
“ఎఫ్‌ 3” కోసం డిసెంబర్‌ 14 నుండి షెడ్యూల్‌ను దిల్‌రాజుగారు ప్లాన్‌ చేసుకున్నారు ఫన్‌ అండ్‌ ఫ్రస్టేషన్‌కు మరో ఎఫ్‌ యాడ్‌ అవుతుంది. గెట్‌ రెడీ ఫర్‌ మోర్‌ ఫన్‌. కరోనాకు వ్యాక్సిన్‌ వస్తుందో రాదో కానీ.. కచ్చితంగా ఎఫ్‌ 3తో ప్రేక్షకులకు నవ్వుల వ్యాక్సిన్‌ వస్తుందని గ్యారంటీ ఇవ్వగలను.

సూపర్‌స్టార్‌ మహేశ్‌తో సినిమా మళ్లీ ఎప్పుడు ఉంటుంది?
మహేశ్‌గారు అనిల్‌ అని పిలిస్తే చాలండి.. నేను డోర్‌ తెరుచుకుని వెళ్లి ఆయన ముందు కూర్చుంటాను. ఆయన ఎప్పుడంటే అప్పుడు సినిమా చేయడానికి నేను రెఢీ. ఆయన పిలిస్తే పరిగెత్తుకెళ్లడమంతే.

ఫ్యూచర్‌ ప్లాన్స్‌ ఏంటి?
చాలా ఐడియాలున్నాయి. ఒకటి తర్వాత మరో సినిమా ప్లాన్‌ చేసుకుంటూ వెళుతున్నాను.

మిమ్మల్ని నటుడిగా తెరపై చూడొచ్చా?
ప్రేక్షకులు దర్శకుడిగా ఇక చాలు బాబు అనే వరకు డైరెక్షనే చేస్తాను. ఆ తర్వాతే యాక్టింగ్‌ గురించి ఆలోచిస్తాను.

 

More

Related Stories