రేచీకటి, నత్తి అందుకే పెట్టా

ఎఫ్ 2తో పోలిస్తే, ఎఫ్3లో పాత్రల్ని బాగా మార్చేశాడు దర్శకుడు అనీల్ రావిపూడి. మరీ ముఖ్యంగా వెంకటేష్ కు రేచీకటి, వరుణ్ తేజ్ కు నత్తి పెట్టాడు. ఇలా ఎందుకు పెట్టాల్సి వచ్చిందనేది ప్రశ్న. దీనికి ఆ దర్శకుడు ఇచ్చిన సమాధానం ఏంటో చూద్దాం.

“ఎఫ్ 2 నుండి ఎఫ్ 3కి వచ్చేసరికి అంచనాలు ఖచ్చితంగా ఎక్కువగా ఉంటాయి. ఫన్ డోస్ పెంచడానికి ఎలిమెంట్స్ ఎక్కువ వుంటే ఇంకా ఎక్కువ చేయగలం. మామూలు పాత్రతో చేసేకంటే ఇలాంటి పాత్రలతో ఎక్కువ ఫన్ చేయొచ్చనిపించి ఈ క్యారెక్టరైజేషన్స్ యాడ్ చేశాం. అయితే అవే క్యారెక్టరైజేషన్స్ పై సినిమా మొత్తం ఉండదు. నైట్ సీన్స్ వచ్చినపుడు ఆ ఫన్ వాడుకుంటాం, వరుణ్ నత్తి మీరు ట్రైలర్ లో చూసే వుంటారు. అది కేవలం ట్రైలర్ మాత్రమే. సినిమా దాదాపు ముఫ్ఫై చోట్ల ఆ మేనరిజం వచ్చింది. ప్రతిసారి కొత్తగా వుంటుంది. ఇది నిజంగా చాలెజింగ్ అనిపించింది. మాట అడ్డుపడినప్పుడల్లా కొత్త మ్యానరిజం చేయాలి. అనుకున్నపుడు ఈజీగా అనిపించింది కానీ ప్రాక్టికల్ గా ప్రతిసారి కొత్త మ్యానరిజం అంటే సీన్ కంటే ఎలాంటి మ్యానరిజం ఇవ్వాలనే ఒత్తిడి ఎక్కువ వుండేది.”

ఇలా హీరోల పాత్రలకు ఎందుకు నత్తి, రేచీకటి పెట్టాల్సి వచ్చిందో వివరించాడు అనీల్ రావిపూడి. ఎఫ్2లో ఇద్దరు హీరోలు కాబట్టి, ఎఫ్3లో ముగ్గురు ఉంటారనే ప్రచారంపై రావిపూడి స్పందించాడు. నిజానికి ముగ్గురు హీరోలుంటే బాగుంటుందని, ఎఫ్4 లో ఆ ప్రయత్నం చేస్తానని ప్రకటించాడు.

 

More

Related Stories