దర్శకుడు అనిల్ రావిపూడి సినిమాలు అనగానే ఎంటర్ టైన్మెంట్ గుర్తొస్తుంది. మొదటి సినిమా “పటాస్” నుంచి నిన్నమొన్నటి “ఎఫ్ 3” వరకు అన్నీ వినోదాత్మక చిత్రాలే. కానీ, ఇప్పుడు పంథా మార్చారు. నందమూరి బాలకృష్ణతో తీస్తున్న “భగవంత్ కేసరి” ట్రైలర్ తోనే అర్థమైంది. ఎంటర్ టైన్మెంట్, పాటలు ఇలాంటి రెగ్యులర్ ప్యాట్రన్ లో కాకుండా కొంత వెరైటీ ట్రై చేసినట్లు కనిపిస్తోంది.
“ఇప్పటివరకు నేను ఆరు సినిమాలు తీశాను. కానీ ఇప్పుడు ఇంటెన్స్ డ్రామా తో ఓ సినిమా చేయాలనిపించింది. దానికి బాలకృష్ణ గారి రూపంలో నాకు సరైన ఆయుధం దొరికింది. ‘భగవంత్ కేసరి’ చాలా ఏళ్లు గుర్తుండిపోయే సినిమాగా నిలుస్తుందని అనుకుంటున్నాను,” అన్నారు అనిల్ రావిపూడి.
“తెలంగాణ యాసలో ఒక ముక్కుసూటి తనం ఉంటుంది. బాలకృష్ణ గారి వ్యక్తిత్వం దానికి దగ్గరగా వుంటుంది. అలా భావించి తీశా. అది బాగా వర్క్ అవుట్ అయ్యింది. ఇందులో చాలా డైలాగ్స్ ఆయన నేచర్ కి దగ్గరగా వుంటాయి. డైలాగ్స్ థియేటర్స్ లో పేలుతాయి,” అని స్పష్టం చేశారు.
ఇకపై తన సినిమాలు ఇలాగే కొత్త పంథాలో ఉంటాయి అని క్లారిటీ ఇచ్చారు.