మహేష్ తో బాండింగ్ మాత్రమే ఉంటే సరిపోదు

“మహేష్ తో క్లోజ్ గా ఉంటే చాలు, ఎప్పుడో ఒకప్పుడు అవకాశం వస్తుంది. ఇప్పటికే చాలామంది ఈ కోటాలో సినిమా ఛాన్సులు పట్టేశారు.”  మహేష్ కు సంబంధించి ఇండస్ట్రీలో వినిపించే పుకారు ఇది. ఇందులో నిజం ఎంతనేది ఎవరికీ తెలీదు. దీనిపై ఎవ్వరూ స్పందించరు కూడా. కానీ అనీల్ రావిపూడి స్పందించాడు.

“మహేష్ తో బాండింగ్ దొరకడం చాలా కష్టం. అయితే ఒకసారి ఆయనకు కనెక్ట్ అయితే వదిలేయడం ఇంకా కష్టం. నాకు ఆ అదృష్టం దక్కింది. మహేష్ తో నాకు చనువు ఏర్పడింది. అయితే మహేష్ తో మరో సినిమా చేయాలంటే ఆ బాండింగ్ ఉంటే సరిపోదు. మంచి కథ దొరకాలి. కథనం సెట్ అవ్వాలి. అప్పుడు మాత్రమే ఆయన ఓకే చేస్తారు. మనోడే కదా అని మొహమాటపడరు.”

ఇలా స్టోరీ సెలక్షన్ విషయంలో మహేష్ వ్యవహారశైలి బయటపెట్టాడు అనీల్ రావిపూడి. నిజానికి సరిలేరు నీకెవ్వరు సినిమా పూర్తయిన వెంటనే మరోసారి అనీల్ కు ఆఫర్ ఇచ్చాడట మహేష్. రావిపూడి వర్కింగ్ స్టయిల్ మహేష్ కు బాగా నచ్చిందట. అయితే అప్పటికే ఎఫ్3కి కమిట్ అవ్వడంతో మహేష్, ఇతర ప్రాజెక్టుల వైపు వెళ్లారని చెప్పుకొచ్చాడు రావిపూడి.

ఇప్పటికీ మహేష్ తో రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్నట్టు తెలిపిన అనీల్ రావిపూడి, స్లాట్ ఇస్తే మహేష్ కోసం కథ సిద్ధం చేయడానికి తను ఎప్పుడూ సిద్ధమని ప్రకటించాడు.

 

More

Related Stories