
అనిల్ రావిపూడి – నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో సినిమా ఫైనల్ అయింది. కాకపొతే, అధికారిక ప్రకటన రాలేదు. ఆ మాటకొస్తే, బాలయ్య తదుపరి చెయ్యబోయే గోపీచంద్ మలినేని చిత్రానికి సంబంధించి కూడా ఆఫీసియల్ అనౌన్స్ మెంట్ రాలేదు. కానీ గోపీచంద్ మలినేని ప్రీ-ప్రొడక్షన్ పనులు చేసుకుంటూ బిజీగా ఉన్నారు.
ఇక అనిల్ రావిపూడి – బాలయ్య కాంబినేషన్లో తెరకెక్కే మూవీ వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిలో మొదలయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే, “F3” షూటింగ్ ఆలస్యం అవుతోంది. అది పూర్తి చేసుకున్న తర్వాతే బాలయ్య సినిమా స్టార్ట్ చెయ్యగలడు. ఈ లోపు, బాలయ్య “అఖండ” విడుదల అవుతుంది. ఆ తర్వాత మలినేని సినిమా పూర్తి చెయ్యాలి. ఇదంతా జరిగేసరికి మరో ఆరేడు, నెలలు పట్టేలా ఉంది.
అందుకే, రావిపూడికి మరికొంతకాలం వెయిటింగ్ తప్పదు. అనిల్ రావిపూడి గతంలో దూకుడు మీద ఉండేవాడు. ఐతే, ఇప్పుడు అన్ని స్లోగా సాగుతున్నాయి.