అనిల్ రావిపూడి డైరెక్షన్ పర్యవేక్షణ

“ఎఫ్ 2”, “సరిలేరు నీకెవ్వరు” చిత్రాల తర్వాత దర్శకుడు అనిల్ రావిపూడి “ఎఫ్ 3” సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు. అలాగే, తన మిత్రుణ్ణి నిర్మాతగా ఇంట్రడ్యూస్ చేస్తూ “గాలి సంపత్” అని సినిమాని రీసెంట్ గా లాంచ్ చేశాడు. అనీష్ కృష్ణ దర్శకత్వంలో శ్రీవిష్ణు, రాజేంద్ర ప్రసాద్ హీరోలుగా ఈ సినిమా మొదలైంది.

ఆ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే అనిల్ రావిపూడిదే. ఐతే, ఇప్పుడు తన పాత్రని అక్కడికే పరిమితం చెయ్యకుండా దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేస్తున్నాడట.

“ఎఫ్ 3” సినిమా షూటింగ్ షెడ్యూల్స్ లో గ్యాప్ దొరికినప్పుడల్లా అనిల్ రావిపూడి “గాలి సంపత్” షూటింగ్ లొకేషన్ కి వెళ్లి ఆ సినిమా పనులు చూస్తాడట. అలాగే, పోస్ట్ ప్రొడక్షన్ కూడా దగ్గరుండి చూసుకుంటాడు. అంటే… ఆల్మోస్ట్ అతనే డైరెక్ట్ చేస్తున్నాడు అనుకోవచ్చు.

More

Related Stories