అనిరుధ్ ఇప్పుడు ఇండియాలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్. అతను సంగీతం అందిస్తే ఆ సినిమా హిట్ అన్నట్లుగా మారింది. తాజాగా “జైలర్” సినిమాకి మొదట క్రేజ్ రావడానికి అతను స్వరపరిచిన “కావాలా” పాట ప్రధాన కారణం. విడుదలకు ముందు అతని సంగీతమే ప్రధానంగా హైప్ తెచ్చింది.
ఇక సినిమాలో కూడా తన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ హైలెట్ అయింది. అందుకే, నిర్మాత కళానిధి మారన్ అనిరుధ్ కి బోనస్ చెక్కుతో పాటు పోర్షా కారు బహుమతిగా ఇచ్చారు.
ఇప్పటికే సూపర్ స్టార్ రజినీకాంత్ కి, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కు ఇలాగే బోనస్ చెక్కులు, కార్లు అందచేశారు మారన్. ఇప్పుడు అనిరుధ్ కి ప్రెజెంట్ చేశారు. “జైలర్” మూవీ తమిళ సినిమా ఇండస్ట్రీలో కొత్త రికార్డులు నెలకొల్పింది. ఈ సినిమాతో నిర్మాత మారన్ భారీగా లాభాలు చూశారు. ఐతే, లాభాలు మొత్తం తానే తీసుకోకుండా వాటిని ఈ సినిమాకి కీలకమైన రజినీకాంత్, నెల్సన్, అనిరుధ్ కి ఇలా భారీ బహుమతులు ఇచ్చారు.
టీంలో ఇతర సభ్యులకు కూడా వారి స్థాయికి తగ్గట్లు బహుమతులు ఇవ్వనున్నారట.