ఇక రజినీ చిత్రాలన్నింటికీ అనిరుధ్!

Anirudh Ravichander

“జైలర్ సినిమా యావరేజ్ చిత్రం. సినిమా రషెస్ చూశాక కలిగిన ఫీలింగ్ అది. కానీ, అనిరుధ్ సంగీతంతో అది సూపర్ మూవీ అయింది. జైలర్ ఇంత సక్సెస్ కావడానికి కారణం అనిరుధ్,” అని సూపర్ స్టార్ రజినీకాంత్ అన్నారు. “జైలర్” సినిమా సక్సెస్ వేడుకలో ఈ విషయం చెప్పారు.

అందుకే, తన తదుపరి చిత్రాలకు సంగీతం అందించే బాధ్యత తన మేనల్లుడు అనిరుధ్ కే అప్పగించారు రజినీకాంత్. అనిరుధ్ తండ్రి రవి రాఘవేంద్ర రజినీకాంత్ కి బావమరిది అవుతారు. అనిరుధ్ సంగీత దర్శకుడిగా మారింది కూడా రజినీకాంత్ కూతురు ఐశ్వర్య డైరెక్ట్ చేసిన చిత్రం (“3”)తోనే. గతంలో “పేట్టా”, “దర్బార్” వంటి రజినీకాంత్ సినిమాలకు అనిరుధ్ సంగీతం ఇచ్చాడు కానీ అవి పెద్దగా ఆడలేదు.

“జైలర్” సినిమా రికార్డులు సృష్టించడమే కాదు అనిరుధ్ సంగీతానికి కూడా బాగా పేరు వచ్చింది. ఇక రజినీకాంత్ త్వరలో నటించే రెండు కొత్త చిత్రాలకు అనిరుధ్ సంగీతం అందివ్వనున్నారు.

“జైభీమ్” దర్శకుడు జ్ఞానవేల్ తీసే చిత్రానికి అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్. ఆ తర్వాత “విక్రమ్” ఫేమ్ లోకేష్ కనగరాజ్ తీసే చిత్రానికి అనిరుధ్ ఉంటాడు. లోకేష్ తన చిత్రాలన్నింటికీ అనిరుధ్ నే తీసుకుంటున్నాడు.

Advertisement
 

More

Related Stories