
అంజలి మళ్ళీ బిజీగా మారింది. ఈ ఒక్క ఏడాదే ఆమె నటించిన నాలుగు సినిమాలు విడుదల కానున్నాయి అంటే నమ్మగలరా. అవును ఆమెకి ఇప్పుడు మళ్లీ దశ తిరిగింది.
అంజలి నటించిన 50వ చిత్రంగా “గీతాంజలి మళ్ళీ వచ్చింది” రూపొందింది. ఈ సినిమా ఏప్రిల్ లో విడుదల కానుంది. ఇది హారర్ చిత్రం. కానీ ఈ సినిమాలో ఆమే హీరో, హీరోయిన్.
మే నెలలో “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” విడుదల అవుతుంది. విశ్వక్ సేన్ హీరోగా రూపొందుతోన్న ఈ చిత్రంలో నేహా శెట్టి హీరోయిన్. కానీ, అంజలి పాత్ర కూడా ఇంపార్టెంట్. ఆమె రెండో హీరోయిన్ అని చెప్పొచ్చు.
ఇక రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ తీస్తున్న భారీ పాన్ ఇండియన్ మూవీ “గేమ్ ఛేంజర్”లో ఆమె ఒక హీరోయిన్. మెయిన్ హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తోంది కానీ అంజలిది చాలా కీలకమైన పాత్ర. ఆమెకి ఇది వెరీ బిగ్ మూవీ. “గేమ్ ఛేంజర్” ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది.
ఈ మూడు సినిమాలతో పాటు తమిళంలో “ఈగై” అనే భారీ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా కూడా ఈ ఏడాదిలోనే విడుదల కానుంది. మొత్తంగా నాలుగు సినిమాలను ఈ ఏడాదికి లైన్లో పెట్టింది అంజలి.