
మొన్న పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘వకీల్ సాబ్’ చిత్రంలో నటించింది అంజలి. ఇప్పుడు అబ్బాయి రామ్ చరణ్ సినిమాలో ఆఫర్ అందుకొంది. ఇది పవన్ కళ్యాణ్ మూవీ కన్నా పెద్ద చిత్రం. ‘వకీల్ సాబ్’ తెలుగు చిత్రం మాత్రమే. రామ్ చరణ్ నటిస్తున్న మూవీ టాప్ డైరెక్టర్ శంకర్ తీస్తున్న పాన్ ఇండియా మూవీ. ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో అంజలి నటించనుంది అనేది టాక్.
ఇందులో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తోంది. ఇప్పటికే ఈ భామ పేరుని ప్రకటించారు. ఐతే, ఇందులో హీరోయిన్ కి సమాంతరంగా ఒక కీలక పాత్ర ఉందట. ఆ రోల్ అంజలికి దక్కింది. అంజలి అనేక తమిళ చిత్రాల్లో నటించింది. ఆమె నటన గురించి తెలిసిన శంకర్ ఆమెకి పిలిచి ఈ ఆఫర్ ఇచ్చారట.
అంజలి కెరియర్ మళ్ళీ పుంజుకుంటోంది అన్నమాట. ఆమె ఇక ‘ఆంటీ’ పాత్రలోకి వచ్చినట్లే అనిపించింది ఆ మధ్య. కానీ ఇప్పుడు వస్తున్న అవకాశాలు చూస్తుంటే ఇంకా లాంగ్ కెరీర్ ఉందని చెప్పొచ్చు.