అసలు అట్రాక్షన్ అంజలీదే!

Anjali

ఏ ఈవెంట్ కైనా గ్లామర్ ముఖ్యం. ఎంత పెద్ద స్టార్ హీరో ఉన్నా… కెమెరా కన్ను హీరోయిన్ల వైపు వెళ్తుంది. అందుకే… హీరోయిన్లు కూడా సినిమా ఈవెంట్స్ కి చాలా అందంగా ముస్తాబై వస్తారు. తమ అందచందాలు అన్ని ‘హైలైట్’ అయ్యేలా జాగ్రత్త పడుతారు.

‘వకీల్ సాబ్’ సినిమాలో నివేత థామస్, అనన్య నాగళ్ళ, అంజలి, శృతి హాసన్ నటించారు. నలుగురు భామలున్నా… ఈవెంట్ కి మాత్రం ఇద్దరే హాజరయ్యారు. ఒకరు అనన్య, మరొకరు అంజలి. శృతి హాసన్ ముంబైలోనే ఉండిపోయింది. నివేధా థామస్ కి కరోనా వచ్చింది. అందుకే ఆమె రాలేకపోయింది. దాంతో గ్లామర్ షో బాధ్యతని అంజలి తీసుకొంది.

ఎల్లో శారీ కట్టుకొని వచ్చిన అంజలి… కెమెరామెన్ లకు కావాల్సినంత ‘స్టఫ్’ ఇచ్చిందనే చెప్పాలి.

చూడండి: అంజలి వకీల్ సాబ్ ఈవెంట్ ఫోటోలు

ఇటీవల, అంజలి సన్నబడింది అనిపించింది. ఆమె ఇన్ స్టాగ్రామ్ ఫొటోస్ అన్ని అలాగే కనిపిస్తాయి. కానీ వకీల్ సాబ్ ఈఈవెంట్ లో ఆమె పర్ఫెక్ట్ గా ఉంది అనిపించింది. మరి సన్నబడలేదు, లావు లేదు. ఈ సినిమా విడుదల తర్వాత తన కొత్త సినిమాల గురించి చెప్తాను అంటోంది అంజలి.

More

Related Stories