బిజీ అవుతోన్న అంజలి


హీరోయిన్ అంజలి మళ్ళీ బిజీ అవుతున్నారు. ఆ మధ్య ఆమె కెరీర్ ఎండింగ్ కి వచ్చింది అనిపించింది. కానీ, బ్యూటీ ఒక్కసారిగా బిజీగా మారరిప్పుడు.

రామ్ చరణ్ తో శంకర్ తీస్తున్న ‘గేమ్ ఛేంజర్’లో ఆమె రెండో హీరోయిన్. ఆమెది కీలకమైన పాత్ర. అలాగే, విశ్వక్ సేన్ హీరోగా రూపొందుతోన్న కొత్త చిత్రంలో కూడా ఈ భామ ఒక హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రెండూ ఆమెకి టాలీవుడ్ లో ప్రముఖమైన చిత్రాలు.

అంజలి హీరోయిన్ గా ఇప్పటివరకు 49 సినిమాలు చేయగా ఆమె 50వ చిత్రం తమిళంలో ప్రారంభమైంది. “ఈగై” అనే పేరుతో ఒక హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలైంది. ఇలా తెలుగులోనూ, తమిళంలోనూ హీరోయిన్ గా మళ్ళీ బిజీ అయినట్లే కనిపిస్తోంది.

ఈ 36 ఏళ్ల బ్యూటీ ఇటీవల బాగా సన్నబడింది. స్లిమ్ గా మారడమే కాకుండా స్కిన్ ట్రీట్ మెంట్ తో మరింత యంగ్ గా కనిపిస్తున్నారు. దాంతో, మళ్ళీ అవకాశాలు పెరిగాయి. నేచురల్ యాక్టింగ్ చేసే అంజలి ఇప్పుడు హైదరాబాద్ కి మకాం మార్చారు.

Advertisement
 

More

Related Stories