
ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఈ రోజు మూడు సినిమాల పోస్టర్లు వస్తాయని ముందు నుంచి ప్రచారం జరిగింది. ‘అర్ ఆర్ ఆర్’ నుంచి కొమరం భీం పోస్టర్, కొరటాల శివ తీయనున్న కొత్త సినిమా బర్త్ డే పోస్టర్ అనుకున్నట్లే వచ్చాయి. కొరటాల శివ సినిమా ఇంకా మొదలు కాలేదు. కానీ ఎన్టీఆర్ స్మార్ట్ గా ఉన్న ఒక కొత్త ఫోటోషూట్ ఫొటోతో కూడిన పోస్టర్ అర్ధరాత్రి రిలీజ్ చేశారు.
ఇక కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో ఎన్టీఆర్ నటించనున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ తో కలిసి మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. ఈ ప్రకటన మధ్యాహ్నం తర్వాత వచ్చింది. ఎప్పుడు మొదలవుతుంది వంటి వివరాలు ఏవీ లేవు.
మరి దర్శకుడు బుచ్చిబాబు సంగతి ఏంటో. బుచ్చిబాబు ఇప్పటికే ఎన్టీఆర్ కి కథ చెప్పాడు. ఐతే, ఎన్టీఆర్ ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ పూర్తి కాగానే కొరటాల శివ సినిమా షురూ చేస్తాడు. ఆ తర్వాత, ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ మూవీ మొదలవుతుంది. మరి బుచ్చిబాబు సినిమా ఎప్పుడు మొదలు పెడుతారో చూడాలి.