దండయాత్ర.. ఇది ఆది దండయాత్ర

హీరో ఆది సాయికుమార్ థియేటర్లపై దండయాత్ర చేస్తూనే ఉన్నాడు. మినిమం గ్యాప్స్ లో సినిమాల్ని రిలీజ్ చేస్తూనే ఉన్నాడు. తాజాగా ఈ హీరో మరో సినిమాను విడుదలకు సిద్ధం చేశాడు. దాని పేరు బ్లాక్.

కొన్నాళ్లుగా కాన్సెప్ట్ సినిమాలు చేస్తున్నాడు ఆది సాయికుమార్. మాస్ మసాలాస్, కమర్షియల్ ఎలిమెంట్స్ కు దూరంగా కథల్ని సెలక్ట్ చేసుకుంటున్నాడు. శశి, అతిథి దేవోభవ లాంటి సినిమాలు ఈ కోవలోకే వస్తాయి. ఇప్పుడీ బ్లాక్ సినిమాను కూడా అదే పంథాలో ఎంపిక చేసుకున్నాడు. ఈ సినిమాతో ఈసారి కచ్చితంగా బాక్సాఫీస్ హిట్ కొడతానంటున్నాడు ఆది సాయికుమార్.

బ్లాక్ సినిమాలో పాటలుండవని, సింగిల్ కాన్సెప్ట్ తో ఈ సినిమా పరుగులు పెడుతుందని చెప్పుకొచ్చాడు ఆది సాయికుమార్. ఇప్పటివరకు తను ఇలాంటి పాత్ర పోషించలేదని, ఈ కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంటుందంటున్నాడు.

మహంకాళీ మూవీస్ బ్యానర్ పై దివాకర్ నిర్మించిన ఈ సినిమాకు జి.బి.కృష్ణ దర్శకుడు. మే 28న బ్లాక్ సినిమా థియేటర్లలోకి వస్తోంది. ఈ సినిమాలో ఆదికి తల్లిగా ఆమని నటించింది.

 

More

Related Stories