అనుష్క సినిమా ఆగిపోలేదు!

Anushka Shetty

దర్శకుడు క్రిష్ ఇటీవల డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నారు. తాజా పరిణామాలను బట్టి చూస్తే క్రిష్ ఈ కేసు నుంచి బయటపడినట్లే. ఈ కేసులో అతనికి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. ఐతే ఈ కేసులో క్రిష్ అరెస్ట్ అవుతాడు అంటూ ఇంతకుముందు చాలా హడావుడి జరిగింది. అలాంటిది ఏమి ఉండదు అని తాజాగా అంటున్నారు.

ఈ కేసు నేపథ్యంలో క్రిష్ కొత్త సినిమాని నిర్మాతలు పక్కన పెట్టారు అన్న పుకార్లు కూడా మొదలయ్యాయి. కానీ అందులో నిజం లేదు.

అనుష్క హీరోయిన్ గా క్రిష్ తీస్తున్న సినిమా ముందు ప్లాన్ చేసినట్లే జరుగుతుంది. ఈ సినిమా ఆగిపోలేదు. ఇకపై ఆగిపోదు.

యువీ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తోంది. ఎప్పుడు విడుదల చెయ్యాలి అనే విషయంలో ఎలాంటి ప్లాన్ లేదు. కాబట్టి తొందరేమీ లేదు. ఈ కేసు వల్ల తాత్కాలికంగా ఇబ్బందులు వచ్చినా మళ్ళీ షూటింగ్ శరవేగంగా జరగడం ఖాయం అని అంటున్నారు టీం మెంబెర్స్.

Advertisement
 

More

Related Stories