అంతా రామమయం!

500 ఏళ్ల తర్వాత అయోధ్యకు చేరుకున్నాడు రాముడు. అయోధ్యలో రామమందిర నిర్మాణం, రాముడి విగ్రహ ప్రతిష్ట అనేది హిందువుల కల. అది ఇన్నేళ్లకు నిజమైంది. సోమవారం (జనవరి 22, 2024) నాడు బాలరాముడు అయోధ్యలో కొలువుదీరాడు.

Advertisement

అంగరంగవైభవంగా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. వేలమంది హాజరయ్యారు. సినిమా తారలు కూడా వెళ్లారు. అయోధ్య రామమందిరానికి వెళ్లిన అతిథులకు, సెలెబ్రెటీలకు ఏడు రకాల ప్రసాదాలతో కూడిన సంచి అందచేశారు.

ఇక మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ అంతా రామ నామమే. “అంతా రామమయం… ఈ జగమంతా రామమయం….” అన్నట్లు అందరూ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని వీక్షించేందుకు టీవీలకు అతుక్కుపోయారు.

దాదాపు టాలీవుడ్ హీరోలందరూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. హీరోయిన్లు తమ ఆధ్యాత్మిక వైఖరి వెల్లడించే వీడియోలు షేర్ చేశారు. టీవీ ఛానెల్స్ మొత్తం అయోధ్య రాముడి గురించే ప్రసారాలు చేశాయి. మొత్తానికి మీడియాలో, సోషల్ మీడియాలో, గుళ్లో, ఊళ్ళో… అన్ని చోట్లా రామ నామ జపమే.

Advertisement
 

More

Related Stories