డబుల్ డోస్ గ్లామర్!

లాంగ్ గ్యాప్ తర్వాత మంచు విష్ణు-శ్రీనువైట్ల కాంబినేషన్ లో రాబోతున్న మూవీ “డి&డి (డబుల్ డోస్)”. “ఢీ” సినిమాకి సీక్వెల్. డబల్ డోస్ అంటే వినోదంలో. అలాగే, గ్లామర్ డోస్ కూడా రెండింతలు ఉంటుంది. “డి&డి” లో అను ఎమ్మాన్యుయేల్, ప్రగ్యా జైశ్వాల్ ను హీరోయిన్లుగా తీసుకుంటున్నారట.

మంచు విష్ణు, అను ఎమ్మాన్యుయేల్ ది ఫ్రెష్ కాంబినేషన్. అటు విష్ణు-ప్రగ్యా మాత్రం గతంలో ఓ సినిమా చేశారు.

అను మళ్ళీ టాలీవుడ్ లో బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఆమె ఇప్పటికే తెలుగులో “మహా సముద్రం”, “అల్లుడు అదుర్స్” సినిమాల్లో నటిస్తోంది. ఇప్పుడు ఈ మూవీ కూడా యాడ్ అవుతోంది. అను, ప్రగ్య ఇద్దరూ అందాలు బాగానే ఆరబోస్తారు.

More

Related Stories