డేటింగ్ ఉందా? ఉత్తదేనా?

హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ గురించి పరిచయం అక్కర్లేదు. పవన్ కళ్యాణ్ వంటి పెద్ద హీరో సరసన నటించింది. ఒక దశలో పెద్ద హీరోయిన్ గా స్థిరపడింది. ఐతే, ఒక సెలెబ్రిటీతో వ్యవహారం ఆమె కెరీర్ ని కష్టాల్లో పడేసింది. మొత్తానికి ఒక రెండేళ్ల గ్యాప్ తీసుకొని మళ్ళీ కెరియర్ పై దృష్టి పెట్టింది. ఇప్పుడు చేతిలో రెండు సినిమాలున్నాయి.

ఆమె నటించిన కొత్త చిత్రం… ఊర్వశివో రాక్షసీవో. ఈ సినిమాలో హీరో అల్లు శిరీష్. ఈ హీరో, ఈ భామ ఈ సినిమాలో చాలా రొమాంటిక్ గా నటించారు. రొమాంటిక్ చిత్రంలో రొమాంటిక్ నటించకుండా బీభత్సరౌద్ర ప్రదర్శన చెయ్యరు కదా అనకండి. అంటే… కొంచెం చెయ్యాల్సిన దాని కన్నా ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యారని గుసగుసలు వినిపిస్తున్నాయి. సినిమాలో కిస్ సీన్లు కూడా ఎక్కువ ఉన్నాయట.

నిజంగా వీరి మధ్య రియల్ లైఫ్ లో కూడా కెమిస్ట్రీ కుదిరిందా? లేక సినిమా కోసమే పాత్రల్లో ఎక్కువ లీనమయ్యారా? అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి.

Urvashivo Rakshashivo’

అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ మధ్య డేటింగ్, ప్రేమ దోమ వంటివి లేవని అంటున్నారు. ఎందుకంటే ఇద్దరూ ఈ విషయాల్లో ముదుర్లు అని తెలిసిన వాళ్ళ మాట. ఏ విషయం ఎక్కడివరకు ఉంచాలో తెలిసిన ముదుర్లు అన్నమాట. సో… డేటింగ్ లేదని అనుకోవచ్చు.

 

More

Related Stories