- Advertisement -

మొదట పెద్ద హీరోల సినిమాల్లో, మిడిల్ రేంజ్ హీరోల సినిమాల్లో నటించింది అను ఇమ్మానుయేల్. నాని, విశాల్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, నాగ చైతన్య… ఇలా పాపులర్ స్టార్స్ తో జత కట్టింది.
కానీ వరుస అపజయాలో, మరో కారణం వల్లో ఆమె కెరీర్ కి ఒక ఏడాదిన్నర పాటు బ్రేక్ పడింది. ఒక్కసారిగా అవకాశాలు గల్లంతయ్యాయి. దాంతో ఆమె ఇప్పుడు చిన్న హీరోల చిత్రాలతో బిజీగా మారే ప్రయత్నం చేస్తోంది.
ఈ ఏడాది స్టార్టింగ్ లో ‘అల్లుడు అదుర్స్’లో నటించింది. ఇప్పుడు అల్లు శిరీష్ సరసన నటిస్తోంది. హీరో ఎవరన్నది కాదు సినిమాలతో బిజీగా ఉండడం ముఖ్యం. ఆ పాలసీతో అవకాశాలు పొందుతోంది అను. ఇది మంచి నిర్ణయమే.