‘టిల్లు స్క్వేర్” సినిమాలో అనుపమ పరమేశ్వరన్ గ్లామరస్ గా కనిపించనుంది అని సినిమా ప్రకటించిన రోజే అర్థమైంది. ఆ తరువాత వచ్చిన టీజర్లు, ట్రైలర్లు, పాటల వీడియోలతో ఆమె చాలా బోల్డ్ గా నటించింది అని పక్కాగా రూఢి అయింది. అందుకే ఈ సినిమాకి చాలా క్రేజ్ వచ్చింది. రిలీజ్ కు ముందే అనుపమ గ్లామర్ షో గురించి, ముద్దుల గురించి డిస్కషన్ నడిచింది.
ఐతే అందరూ ఊహించిన దానికన్నా ఎక్కువగా బోల్డ్ గా నటించింది అని చెప్పాలి. నిన్న సినిమా విడుదలైన తర్వాత అందరికీ అర్థమైంది అనుపమ మరీ రెచ్చిపోయింది అని.
ఈ సినిమాలో ఆమె నాలుగు ముద్దు సీన్లలో నటించింది. రెండు ముద్దు సీన్ల నిడివి కూడా పెద్దదే. అలాగే వాటి ఘాడత కూడా ఎక్కువే. సో, అనుపమ సరికొత్త సెక్స్ బాంబ్ ఇమేజ్ తెచ్చుకున్నట్లే.
ఈ సినిమా కూడా సక్సెస్ కావడం ఆమెకి ప్లస్ పాయింట్. మరి ఇక ముందు ఇంకా ఎంతగా రెచ్చిపోతుందో చూడాలి. “నా వయసు ఇప్పుడు 29. ఈ వయసుకి తగ్గట్లు నటించాలి కదా,”అని తన బోల్డ్ అవతారాన్ని ఆమె సమర్ధించుకుంటోంది.
ASLO READ: Day 1: Tillu Square collects big money