ఎట్టకేలకు మరో ఛాన్స్

ఈ ఏడాదికి సంబంధించి తొలి ఛాన్స్ అందుకుంది హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. ఇంకా చెప్పాలంటే ఆమె చివరి సినిమా విడుదలైన ఏడాది తర్వాత మరో అవకాశం దక్కించుకుంది.

నిఖిల్ హీరోగా గీతాఆర్ట్స్-2 బ్యానర్ పై రాబోతున్న “18-పేజెస్” సినిమాలో హీరోయిన్ గా నటించబోతోంది అనుపమ.

నిజానికి ఈ సినిమాలో ముందుగా అనుపమ పేరే తెరపైకి వచ్చింది. కానీ అంతలోనే ఆమె కాదని, ఆమె స్థానంలో మరో హీరోయిన్ ను తీసుకోబోతున్నట్టు ప్రచారం జరిగింది. ఈ క్రమంలో అను ఎమ్మాన్యుయేల్, షాలినీపాండే తో పాటు ‘ఉప్పెన’ ఫేం కృతి షెట్టి పేరు కూడా వినిపించింది. అలా చుట్టూ తిరిగి అనుపమ పరమేశ్వరన్ నే వరించింది “18-పేజెస్” ఆఫర్.

ఇప్పుడు అనుపమకు ఉన్న ఏకైక లైఫ్ లైన్ ఈ సినిమా మాత్రమే. ఈ సినిమా హిట్టయితేనే ఆమెకు మరిన్ని అవకాశాలు. ఈ తెలుగు సినిమాతో పాటు ఓ మలయాళం, మరో తమిళ సినిమా అనుపమ చేతిలో ఉన్నాయి.

Related Stories