అనుపమ పరమేశ్వరన్ కి యూత్ లో బాగా క్రేజ్ ఉంది. ఆమె ఈ రోజు (డిసెంబర్ 20) “ఈగిల్” ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి అటెండ్ అయినప్పుడు కుర్రకారు తెగ ఈలలు వేశారు. చాలా కామెంట్స్ చేశారు. ఆమె వాటిని బాగా ఎంజాయ్ చేసినట్లు ఉంది.
స్టేజిపైకి వెళ్ళినప్పుడు ఆమె అదే విషయాన్ని ప్రస్తావించింది.
“నేను అక్కడ కింద కూర్చున్నప్పుడు బెండకాయ… దొండకాయ అనుపమ అంటూ అల్లరి చేశారు. ఇప్పుడు ఏంటి సైలెంట్ అయ్యారు. ఏమి అనట్లేదు ఏంటి,” అంటూ కుర్రకారుని హుషారెత్తించింది.
మంచి తెలుగు మాట్లాడే ఈ మలయాళీ బ్యూటీ ఫ్యాన్స్ చేసే అల్లరిని ఇష్టపడుతుండడాన్ని విశేషంగా చెప్పుకోవాలి. ఎందుకంటే చాలామంది హీరోయిన్లు ఫ్యాన్స్ చేసే కామెంట్స్ తో చిరాకు పడుతారు.
రవితేజ హీరోగా నటించిన “ఈగిల్”లో ఆమె ఒక కీలక పాత్ర పోషించింది. అలాగే “టిల్లు స్క్వేర్”లో ఆమె హీరోయిన్ గా నటిస్తోంది. సో, 2023లో ఆమె సందడి బాగా ఉంటుందని చెప్పొచ్చు.