ఊపిరి పీల్చుకున్న అనుపమ


క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా పెళ్లి చేసుకున్నాడు. గాళ్ ఫ్రెండ్ సంజన గణేష్ తో పెళ్లి జరిగింది. బుమ్రా పెళ్లి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

హీరోయిన్ అనుపమకి ఇది గొప్ప ఊరట. బుమ్రా పెళ్లి చేసుకుంటే ఆమెకి ఎందుకు ఆనందం అనుకుంటున్నారా? అవును మరి.. మొన్నటి వరకు పుకార్లతో అనుపమ సతమతం అయింది. అనుపమ పరమేశ్వరన్ తో బుమ్రా పెళ్లి అంటూ నేషనల్ మీడియా కూడా హోరెత్తించింది. దాంతో అనుపమ తల్లి కూడా మీడియా ముందుకు రావాల్సి వచ్చింది.

బుమ్రాతో అనుపమ పెళ్లి వార్తలు అబద్దమని, దయచేసి అలాంటి తప్పుడు కథనాలు ప్రసారం చెయ్యొద్దు, ప్రచురించొద్దు అంటూ ఆమె మీడియాని వేడుకొంది. ఇప్పుడు జస్ప్రీత్ బుమ్రా సంజనని పెళ్లి చేసుకొని, ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చెయ్యడంతో అనుపమకు పెద్ద రిలీఫ్. ఇకపై ఆమెకి ఈ పుకార్ల గొడవ ఉండదు కదా.

అనుపమ, బుమ్రాకి లింక్ కడుతూ ప్రచారం జరగడానికి రీజన్ ఉంది. ఇన్ స్టాగ్రామ్ లో బుమ్రా ఫాలో అయిన ఏకైక హీరోయిన్ అనుపమ. ఇద్దరూ కామన్ ఫ్రెండ్స్ తో కలిసిన ఫోటోలు కూడా బయటికి వచ్చాయి. ఐతే, ఈ పుకార్లు ఎక్కువ కాగానే, బుమ్రా అనుపమని ఆన్ ఫాలో అయ్యాడు. అలాగే, బుమ్రా తన గాళ్ ఫ్రెండ్ ఎవరు అన్న విషయాన్నీ మొన్నటి వరకు సస్పెన్స్ లో ఉంచాడు.

More

Related Stories