
‘అఆ’, శతమానం భవతి, హలో గురూ ప్రేమ కోసమే వంటి చిత్రాలతో పాపులర్ అయిన అనుపమ పరమేశ్వరన్ తాజాగా హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం ఒప్పుకొంది. అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘బటర్ ఫ్లై’.
జెన్ నెక్ట్స్ మూవీస్ బ్యానర్‌పై గంటా సతీష్ బాబు దర్శకత్వంలో రవి ప్రకాష్ బోడపాటి, ప్రసాద్ తిరువళ్లూరి, ప్రదీప్ నల్లిమెల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శుక్రవారం (ఫిబ్రవరి 18) అనుపమ పరమేశ్వరన్ పుట్టినరోజు ఈ సందర్భంగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.
యువత, అటు ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యేలా వైవిధ్యమైన కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నామని చెప్పారు మేకర్స్.
అరవింద్ షారోన్ (అర్విజ్), గిడోన్ కట్టా సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
అనుపమ ప్రస్తుతం ‘కార్తికేయ 2′, ’18 పేజెస్’ అనే సినిమాల్లో నటిస్తోంది.