నేను సింగిల్ కాదు

అనుపమ పరమేశ్వరన్ కూడా డేటింగ్ క్లబ్ లోకి చేరిపోయింది. తను కూడా ప్రేమలో ఉన్నట్టు ప్రకటించింది ఈ ముద్దుగుమ్మ. అయితే అది ఎలాంటి ప్రేమ అనేది ఆమె క్లారిటీ ఇవ్వలేదు. తను ఓ వ్యక్తిని ప్రేమిస్తున్నానని, కానీ అది వన్ సైడ్ లవ్ లా సాగుతోందనేది అనుపమ స్టేట్ మెంట్.

“నేను సింగిల్ కాదు, అలా అని లవ్ అని కూడా చెప్పలేను. ఎందుకంటే నాకే క్లారిటీ లేదు. నాది వన్ సైడ్ లవ్. ప్రస్తుతం ఇది నా పరిస్థితి.”

ఇలా తను ప్రేమలో ఉన్న విషయాన్ని బయటపెట్టింది అనుపమ పరమేశ్వరన్. తన కొత్త సినిమా బట్టర్ ఫ్లై ప్రమోషన్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయటపెట్టింది. అయితే తను ప్రేమిస్తున్న వ్యక్తి ఎవరనే విషయాన్ని మాత్రం ఆమె బయటపెట్టలేదు. పూర్తి క్లారిటీ వచ్చిన తర్వాత చెబుతానంటూ తప్పించుకుంది.

తనకు ప్రేమ వివాహమే ఇష్టమని ప్రకటించింది అనుపమ. ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు కూడా చెప్పేశానంటోంది. తను ప్రస్తుతం సింగిల్ కాదని, అలా అని ఎవ్వరితోనూ పూర్తిస్థాయిలో మింగిల్ అవ్వలేదని కూడా అంటోంది.

 

More

Related Stories