ఈ అనుభవం సరిపోదు: అనుపమ

Anupama


హీరోలు డైరెక్టర్లు అవుతున్నారు. విశ్వక్ సేన్ వంటి హీరోలు నటిస్తూనే డైరెక్షన్ చేస్తున్నారు. ఇక కొందరు హీరోలు ఘోస్ట్ డైరెక్షన్ చేస్తారు. మొత్తమ్మీద, చాలామంది నటులకు ‘డైరెక్షన్’ అనేది ఒక ప్రత్యేకమైన ‘అది’.

హీరోయిన్ అనుపమ కూడా ఈ జాబితాలో చేరనుంది. ఆమె కల… డైరెక్టర్ కావాలనేది. ఆ విషయం అందరికీ తెలుసు. మరి, ఈ భామ డైరెక్టర్ చైర్ లో ఎప్పుడు కూర్చోనుంది? అదే విషయం అడిగితే, దానికి ఇంకా టైం కావాలి అంటోంది.

“అందరూ నన్ను డైరెక్షన్ ఎప్పుడు అని అడుగుతున్నారు. ఒప్పుకున్న కమిట్మెంట్స్ అయిపోవాలి. ఆ తరువాత ఇంకా చాలా మంది దర్శకుల దగ్గర నుంచి మెళకువలు నేర్చుకోవాలి. ఇంకా చాలా టెక్నీకల్ విషయాలు నేర్చుకోవాలి. ఇప్పుడున్న అనుభవం సరిపోదు. ఇంకా అనుభవం వచ్చాక కచ్చితంగా డైరెక్షన్ చేస్తాను,” అని తెలిపింది అనుపమ.

అలాగే, తాను డైరెక్ట్ చేసే సినిమాలో ఈ అమ్మడు నటించదట.

 

More

Related Stories