అనుపమ పెళ్లి పుకారు మళ్ళీ షికారు

Anupama

అనుపమ ఒక క్రికెటర్ ని పెళ్లాడనుందని చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. క్రికెటర్ బుమ్రా, అనుపమ డేటింగ్ గురించి ఎన్ని పుకార్లు షికార్లు చేశాయి. గతంలోనే అనుపమ ఈ పుకార్లను తోసిపుచ్చింది. ఐతే, లేటెస్ట్ గా బుమ్రా పెళ్లి ఫిక్స్ అయిందని సోషల్ మీడియా హోరెత్తుతోంది. అతను చేసుకోబోయే అమ్మాయి ఒక హీరోయిన్ అంటూ వార్తలు గుప్పుమనడంతో మరోసారి అనుపమపై చూపు పడింది.

‘ప్రేమమ్’, ‘అ ఆ’, ‘శతమానం భవతి’, ‘హలొ గురు ప్రేమకోసమే’, ‘రాక్షసుడు’ సినిమాలతో టాలీవుడ్ లో మళ్ళీ పొజిషన్ పొందిన కేరళ కుట్టికి, బుమ్రాకి ఎలా లింక్ కుదిరిందనేది ఇప్పటికే మిస్టరీనే. బుమ్రా… సోషల్ మీడియాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్ అనుపమనే.

అనుపమ ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాల్లో నటిస్తోంది. ఆమె ఈ పుకార్లను పట్టించుకోవడం లేదు. మరి ఈ ప్రచారానికి రీజన్ ఏంటో?

More

Related Stories