
‘డీజె టిల్లు 2’ సినిమా నుంచి హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తప్పుకొంది. ఆ సినిమా నుంచి బయటికి వచ్చింది. హీరో సిద్ధూ జొన్నలగడ్డతో గొడవ వల్ల అనుపమ ఆ సినిమా చెయ్యకూడదని అనుకొంది. ఆమె స్థానంలో మరో హీరోయిన్ ని తీసుకుంటున్నారు మేకర్స్.
ఇప్పటివరకు అనుపమ ఈ ‘ఎగ్జిట్’ గురించి అధికారికంగా స్పందించలేదు. సినిమా టీం కూడా మాట్లాడడం లేదు.
ఐతే, ఆమె తెలివిగా ఒక పాత కొటేషన్ ని కొత్తగా షేర్ చేసింది. ఏడాది క్రితం ఒక ఇంగ్లీష్ కొటేషన్ తో కూడిన ఫోటోని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఆ పాత ఫోటో, దాని కొటేషన్ ని తాజాగా మరోసారి షేర్ చేసింది.
ఈ సినిమా నుంచి తప్పుకోవడం విషయంలో తన స్పందన ఇదే అని ఇన్ డైరెక్ట్ గా చెప్పింది అనుపమ. ఒక చోటు నుంచి బయటికి అడుగుపెడితే మరో చోటుకి దారి దొరుకుతుంది అని ఆమె రాసుకొంది. “Every exit is an entry to somewhere else” – అనేది ఆమె పెట్టిన కొటేషన్.

ఇంతకన్నా చెప్పడం దేనికి అని బ్యూటీఫుల్ గా పోస్ట్ చేసింది ఈ బ్యూటీ.