అనుపమ ఇలా సమాధానం చెప్తోంది

Anupama Parameswaran

అనుపమ పెళ్లి గురించి నేషనల్ మీడియాలో రెండు, మూడు రోజుల పాటు రచ్చ జరిగింది. దాదాపు అన్ని ప్రముఖ దినపత్రికలు, న్యూస్ ఛానెల్స్, వెబ్ సైట్స్ ఆమె పెళ్లి విషయంలో గోల గోల చేశాయి. దీనికంతటికి కారణం… క్రికెటర్ బుమ్రా పెళ్లి చేసుకోబుతుండడమే. బుమ్రాతో అనుపమ డేటింగ్ చేస్తోందని చాలాకాలంగా వార్తలు ఉండడంతో మీడియా కన్ఫ్యూజ్ అయింది.

ఐతే, ఇదంతా ఉత్తిదే అని తేలింది.

అనుపమ మాత్రం అసలు ఈ వార్తల విషయంలో స్పందించలేదు. రెండు రోజులుగా ఆమె ఇన్ స్టాగ్రామ్ లో కొత్త ఫోటోలు పెడుతూ తాను ఎంత హ్యాపీగా ఉన్నానో చెప్తోంది. పెళ్లి పుకార్లని పూర్తిగా ఇగ్నోర్ చేసింది ఈ బ్యూటీ.

అనుపమ ప్రస్తుతం ‘కార్తికేయ 2’ సినిమా షూటింగ్ లో ఉంది. అలాగే దిల్ రాజు నిర్మిస్తున్న సినిమాలో కూడా నటిస్తోంది. తెలుగులో మళ్ళీ బిజి అవుతోంది

More

Related Stories