అనుష్క కూతురు పేరు వామిక

Virata Kohli and Anushka Sharma

బాలీవుడ్ నటి అనుష్క శర్మ, ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తమ కూతురుకి వామిక అని పేరు పెట్టారు. అనుష్క గత నెలలో అమ్మాయికి జన్మనిచ్చింది. 20 రోజుల తర్వాత తన పాప, భర్తతో కలిసి దిగిన ఫోటోని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

“మా చిన్నారి వామిక జీవితానికి కొత్త అర్థం తెచ్చింది. కన్నీళ్లు, నవ్వులు, ఆందోళన, ఆనందం… అన్ని క్షణాల్లోనే అల్లుకుంటాయి. నిద్ర ఉండట్లేదు అన్నది నిజమే. కానీ గుండె నిండిపోయింది ప్రేమతో,” అంటూ అనుష్క శర్మ ఫోటోని పోస్ట్ చేసింది.

“ఆదిపురుష్” సినిమాలో ప్రభాస్ సరసన అనుష్క శర్మని తీసుకోవాలనుకున్నారు. ఐతే, ఆమె తల్లి కావడంతో ఆ ప్లాన్ డ్రాప్ అయింది. అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ అనేక ఏళ్ళు డేటింగ్ చేసి మూడేళ్ళ క్రితం పెళ్లి చేసుకున్నారు.

More

Related Stories