మళ్ళీ బాడీ షేమింగ్ బెడద

హీరోయిన్ల బరువు గురించి, శరీర కొలతలు గురించి ట్రోలర్స్ కామెంట్ చెయ్యడం సోషల్ మీడియాలో ఎక్కువైంది. ముఖ్యంగా పెద్ద హీరోయిన్లు ఈ సమస్యని ఎక్కువగా ఎదుర్కుంటున్నారు. ఫన్నీగా మీమ్స్ చెయ్యడం వరకు ఓకే కానీ వారిని కించపరిచేలా మాట్లాడే ధోరణి ప్రబలింది. తాజాగా అనుష్క కూడా దారుణమైన ట్రోలింగ్ ని ఎదుర్కొంటోంది.

ఆమె చాలా కాలంగా బరువు సమస్యని ఎదుర్కొంటున్న మాట నిజం. కొన్ని ఆరోగ్య కారణాల వల్ల ఆమె ఫిట్నెస్ సాధించలేకపోతోంది. అందుకే, ఆమె సినిమాలు కూడా పూర్తిగా తగ్గించింది. కేవలం ఒక సినిమా మాత్రమే ఆమె ఒప్పుకొంది. ఆ షూటింగ్ జరుగుతోంది.

ఐతే, రీసెంట్ గా శివరాత్రిని పురస్కరించుకొని ఆమె ఒక గుడికి వెళ్లి పూజ చేసింది. ఆ ఫోటోలు, వీడియోలు బయటికి వచ్చాయి. ఆ ఫొటోల్లో ఆమె ముఖం ఉబ్బి ఉందని, ఆమె బాగా లావు ఐంది అని అంటూ మొదలు అయిన కామెంట్స్ మెల్లగా అసభ్యకరంగా మారాయి. ఏకంగా ఆమె ఫోటోలని, రకరకాల వస్తువులతో పోల్చుతూ… అలా ఉంది అంటూ మీమ్స్ క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు.

ఆమె బద్ధకం వల్ల లావు తగ్గలేకపోతుంది అనుకుంటే పొరపాటు. ఆమెకి ఆరోగ్య సమస్య ఉంది. ఈ విషయం తెలిసి కూడా ట్రోలర్స్ బాడీ షేమింగ్ చేస్తున్నారు. బాడీ షేమింగ్ తప్పు అని ఎంత మొత్తుకుంటున్నా ట్రోలర్స్ మారడం లేదు.

 

More

Related Stories