
అనుష్క మళ్ళీ వచ్చింది. సినిమాల్లో ఇక నటించదు అనే ప్రచారం నిజం కాలేదు. చాలా గ్యాప్ తర్వాత మేకప్ వేసుకుంటోంది. ఆమె నటిస్తున్న కొత్త చిత్రంలో హీరో ‘జాతిరత్నాలు’ ఫేమ్ నవీన్ పోలిశెట్టి. ఈ నెల నాలుగు నుంచి షూటింగ్ షురూ.
అనుష్క మళ్ళీ నటిస్తుండడంతో మరో పుకారు కూడా షికారు చెయ్యడం మొదలుపెట్టింది. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ఒక చిత్రం చెయ్యనున్నారు. ఇది ‘పాన్ ఇండియా’ టైపు మూవీ కాదు. తెలుగు ప్రేక్షకులను టార్గెట్ చేసి తీస్తున్న ఎంటర్టైనర్. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు. అందులో ఒక భామగా ప్రభాస్ అనుష్కకి ఛాన్స్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
కానీ, మారుతి అలాంటి నిర్ణయం తీసుకుంటారా అన్నది డౌటే. ఎందుకంటే, ఈ సినిమాని ‘గ్లామరస్’గా ముస్తాబు చెయ్యాలి అనేది ప్లాన్. మాళవిక మోహనన్, శ్రీలీల వంటి కుర్ర భామల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ లిస్ట్ లో అనుష్క కొంచెం సీనియర్ కదా. చూడాలి మరి ఈ పుకార్లలో నిజమెంతో.
ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో సినిమా కూడా ఈ ఏడాదే మొదలవుతుంది అని టాక్.