పోలవరంలో అనుష్క పూజలు

- Advertisement -

హీరోయిన్ అనుష్క పోలవరం ప్రజలకు సర్ ప్రైజ్ ఇచ్చింది. ఒక అతి సామాన్య భక్తురాలిగా సాదాసీదాగా పోలవరం దగ్గర గోదావరి నది మధ్యలో ఉన్న మహానందీశ్వర ఆలయానికి విచ్చేసి అక్కడ పూజలు చేసింది. “బాహుబలి” కాస్ట్యూమ్ డిజైనర్, తన మిత్రురాలు ప్రశాంతి ఆమెని ఈ ఆలయానికి తీసుకొచ్చారు. ఎటువంటి హడావిడి లేకుండా… సింపుల్ గా ఒక చిన్న పడవలో ప్రయాణం చేసి ఆ టెంపుల్ కి చేరుకున్నారు.

అనుష్క వెంట ఎవరూ స్టాఫ్ లేరు, సెక్యూరిటీ లేదు. అతి సామాన్య భక్తురాలిలా గుడికి వచ్చి, పూజలు చేసి వెళ్ళిపోయింది స్వీటీ. స్థానికులు మొదట అనుష్కని గుర్తు పట్టలేదు. ఆమె సింప్లిసిటీ చూసి అనుమానపడ్డారు. పైగా కరోనా కారణంగా మాస్క్ ధరించింది. ఆమె నిజంగానే అనుష్క అని తెలిసిన తర్వాత సెల్ఫీలు తీసుకున్నారు.

అనుష్క ఇంకా తన కొత్త సినిమా అనౌన్స్ చెయ్యలేదు.

 

More

Related Stories