గవాస్కర్ పై ఫైర్ అయిన అనుష్క

Anushka Sharma

క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్ పై బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ విరుచుకుపడింది. ఐపీఎల్ కామెంటరీలో భాగంగా గవాస్కర్ చేసిన ఒక కామెంట్ ఆమెకి కోపాన్ని తెప్పించింది. గవాస్కర్ వివరణ కానీ, క్షమాపణలు కానీ చెప్పాలని కోరింది.

అనుష్క శర్మ భర్త విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు సునీల్ గవాస్కర్ కామెంటరీ చెప్తూ…. లాక్డౌన్ టైంలో కూడా విరాట్ ఇంట్లో అనుష్కతో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు అని అన్నాడట. “ఇంట్లో బ్యాటింగ్” అనే మాటలో ద్వందార్థం స్ఫురించడంతో అనుష్క ఫైర్ అయింది. “తన భర్త బాటింగ్ గురించి కామెంటరి చెప్పేటప్పడు నా ప్రస్తావన ఎందుకు తీసుకురావాలి. ఇదేమి సంస్కారం,” అంటూ అనుష్క ఇన్ స్టాగ్రామ్ లో మండిపడింది.

ఐతే, గవాస్కర్ మాటని తప్పుగా అర్థం చేసుకున్నారు అని అంటున్నారు. గవాస్కర్ నిజంగానే విరాట్ కోహ్లీ తన బాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో గురించి మాట్లాడాడు అని అంటున్నారు. ఎందుకంటే… లాక్డౌన్ పీరియడ్ లో విరాట్ భార్య అనుష్క తో బాటింగ్ చేసున్న వీడియో ని సోషల్ మీడియాలో పోస్ట్

చేశారు. ఆ వీడియో గురించి గవాస్కర్ మాట్లాడితే, సోషల్ మీడియాలో కొందరు డబుల్ మీనింగ్ తో అలోచించి అనుష్కని తప్పుదారి పట్టించారు అనేది మరో వాదన.

Related Stories