అనుష్క మలయాళ సినిమా షురూ

అనుష్క శెట్టి సినిమాల సంఖ్య తగ్గించింది అన్న విషయం మనందరికీ తెలుసు. బరువు సమస్య కారణంగా సినిమాలు చెయ్యట్లేదు. కేవలం యువి క్రియేషన్స్ సంస్థ నిర్మించే సినిమాలే ఒప్పుకుంటూ వస్తోంది. ఎందుకంటే ఆ బ్యానర్ నిర్మాతలు ఆమె మిత్రులు. వాళ్ళు ఎంత ఖర్చు పెట్టైనా విజువల్ ఎఫెక్ట్స్ తో అనుష్కని అందంగా, కాస్త సన్నగా చూపించారు. “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” వంటి సినిమాలు అలా వచ్చినవే.

ఐతే, ఆమె ఇప్పుడు మలయాళంలో నటిస్తోంది. ఆమె “కథనార్” అనే సినిమా సైన్ చేసింది. ఈ సినిమా షూటింగ్ మొదలైంది. షూటింగ్ లో జాయిన్ అయినట్లు అనుష్క తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

ఆమె తాజా ఫోటోలు చూస్తుంటే ఆమె చాలావరకు బరువు తగ్గినట్లు కనిపిస్తోంది. ఆమె ముఖం కూడా మునుపటితో పోల్చితే గ్లామర్ గా మారింది. అందుకే కాబోలు ఆమె ఇప్పుడు కాన్ఫిడెంట్ గా మలయాళ సినిమా అంగీకరించింది.

మరి తెలుగులో కూడా ఇతర నిర్మాణ సంస్థలకు సినిమాలు చేస్తుందా అన్నది చూడాలి.

Advertisement
 

More

Related Stories