అనుష్క సోదరుడికి మాఫియా బెదిరింపులు

అనుష్క సోదరుడు గుణరంజన్ శెట్టికి మాఫియా బెదిరింపులు వచ్చాయి. అంతేకాదు, అతడ్ని హత్య చేసేందుకు కుట్ర కూడా జరిగింది. ఈ విషయాన్ని కర్నాటక పోలీసులు బయటపెట్టారు. ఇంతకీ  ఈ గుణరంజన్ శెట్టి ఎవరు? ఎందుకు ఇతడ్ని మాఫియా చంపాలనుకుంటోంది?

మంగళూరుకు చెందిన ముత్తప్ప రాయ్, కర్నాటకలో పెద్ద మాఫియా డాన్. అతడికి కుడి భుజంగా అనుష్క సోదరుడు గుణరంజన్ శెట్టి ఉండేవాడు. ఇక ఎడమ భుజంగా మన్విత్ రాయ్ ఉండేవాడు. ముత్తప్ప రాయ్ చనిపోయిన తర్వాత గుణరంజన్-మన్విత్ మధ్య విభేదాలు ఎక్కువయ్యాయి.

ఈ క్రమంలో గుణరంజన్ ను చంపేందుకు మన్విత్ రాయ్ అనుచరుడు రంగేష్ మల్లియన్ స్కెచ్ వేశాడు. ఆల్రెడీ బెదిరింపులకు పాల్పడ్డాడు. హత్యకు కుట్ర కూడా పన్నాడు. ఈ విషయాన్ని పోలీసులు కనిబెట్టి ఛేదించారు. ఈ క్రమంలో తనకు సెక్యూరిటీ కావాలంటూ అనుష్క సోదరుడు కర్నాటక హోం మినిస్టర్ ను వేడుకున్నాడు.

మరోవైపు ఈ మొత్తం ఘటనపై మన్విత్ రాయ్ స్పందించాడు. తను ఇండియాలో లేనని, విదేశాల్లో ఉన్నానని, తనకు ఈ కుట్రకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశాడు. ఈ గ్యాంగ్ వార్స్ సంగతి పక్కనపెడితే.. అనుష్క సోదరుడికి మాఫియాతో లింక్స్ ఉన్నాయనే విషయం తాజా ఘటనతో బయటపడింది. అనుష్కకు మరో సోదరుడు కూడా ఉన్నాడు. అతడి పేరు రమేష్ శెట్టి.

 

More

Related Stories